చాలా మంది పనిచేస్తూ ,టీవి చూస్తూ స్నాక్స్  తినే అలవాటు ఉంటుంది.  గంటా రెండు గంటలకు బిస్కెట్లు ,చిప్స్ వంటివి తినేస్తారు. ఈ అలవాటు వాళ్ళకి శరీరం బరువు పెంచేస్తున్నదని చెపుతున్నారు ఎక్ పర్ట్స్.  ఇలా స్నాక్స్ తింటే శరీరంలోకి ఏడాదికి లక్ష కెలరీలు అదనంగా వచ్చిపడి పోతాయి.  నాలుగైదు బిస్కెట్లు తినేసి ఓ కప్పు కాఫీ తాగేసి ఏ ముంది సింపుల్ గా అనుకొంటే తప్పులో కాలేసినట్లే .  80 నుంచి 100 కాలరీలు అదనంగా శరీరంలో చేరుతాయి.  ఒక్క చిన్న కేక్ లో పది పన్నేండు  గ్రాముల కొవ్వు  300నుంచి 400 కేలరీలు ఉంటాయి.  ఇది రోజుకు ఒక్కటీ తిన్న ఊబకాయం వచ్చేసినట్లే . కూర్చుని పని చేసే మహిళలు ముఖ్యంగా ఈ  చిరుతిండికి దూరంగా ఉండాలంటున్నారు.

Leave a comment