సాఫ్ట్ వేరు ఇంజనీరింగ్ చదివిన పూజిత పొన్నడ మొదటి సినిమా దర్శకుడు అనుకున్నంత సక్సెస్ కాకపోయినా రంగస్థలంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఇందులో నా పాత్ర పెద్దదా, చిన్నదా అని నేను లెక్కలు వేసుకోలేదు.  సుకుమార్ గారు నాకు మెంటర్,  గైడ్ ఆయన అడిగారు ఒప్పుకున్నా అంటోంది పూజిత.  కానీ ఒక్క విషయంలో నాకు కాస్త నిరాశగా ఉంటుంది.  తెలుగు అమ్మాయిలు  బాగా చేయరన్న నమ్మకం బాగా పాతుకుపోయింది. అందుకే పరభాషా హీరోయిన్ లను తప్ప లోకల్ టాలెంట్స్ ను అస్సలు ఎంకరేజ్ చేయక , పక్క భాషల వాళ్ళు మన అమ్మాయిలకు మంచి అవకాశాలే ఇస్తున్నారు.  ఇక్కడ అంత ప్రోత్సహం అందదు అంటోంది పూజిత. నా నమ్మకం టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయి.  ఇప్పుడు నాకు ఇంకా ఒక రెంజ్ సినిమా అవకాశాలు వచ్చాయి.  ఇప్పుడే కెరీర్ లో బిజీ అవుతున్నాను  అంటోంది విశాఖపట్నం అమ్మాయి పూజిత పొన్నడ.

Leave a comment