మరుసటి రోజుకి కార్డియాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవడం..

ఆయన ఓపీలో కుర్చీలో కూర్చుని మన నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేయటం..

లేదా

ఛాతినొప్పి వచ్చిందని దగ్గర్లో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్ కి వెళ్ళి ఈసీజీ చేయించుకోవడానికి సిద్ధమవటం. మన నెంబర్ వచ్చే దాకా ఆగి అప్పుడు ఈసీజీ తీసుకోవడం…ఆ తరువాత ఎప్పుడో డాక్టరుని కలవటం..

“ఇవేవీ చేయకూడదంటే చేయకూడదు”.

మరేం చేయాలి?———
ఛాతిలో నొప్పి రాగానే దగ్గర్లో ఉన్న పెద్ద ఆసుపత్రి కి వెళ్ళి అక్కడి casualty or emergency department కి వెళ్ళాలి. అక్కడ డాక్టర్లకు కండీషన్ వివరించాలి. అక్కడ నిముషాల్లో ఈసీజీ తీయటం..వెనువెంటనే వ్యాధి ఉందా లేదా అన్న విషయం నిర్ధారణ చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఛాతి లో వచ్చే ప్రతీ నొప్పి గుండె నొప్పి కాకపోవచ్చు…కానీ టైం బాగా లేకపోతే వచ్చిన ఛాతి నొప్పే గుండెనొప్పి కూడా అయి వుండవచ్చు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే…గుండెనొప్పి సరదాగా వచ్చి డాక్టర్ల కోసమో…లేక ఈసీజీ టెక్నీషియన్ల కోసమో నిరీక్షించదు. వచ్చిందే ఛాతి నొప్పి నిజంగా గుండె నొప్పే ఐతే…క్షణాల్లో లేదా నిమిషాల్లో ప్రాణాలు తీయగలదు.
డా. విరివింటి విరించి (కార్డియాలజిస్ట్)
+91 99486 16191

Leave a comment