“వక్రతుండ మహా కాయ…కోటి సూర్య సమప్రభ!!నిర్విఘ్నం కురుమే దేవ..సర్వ కార్యేషు సర్వదా”!!

తూర్పు గోదావరి జిల్ల సమీపంలోని బిక్కవోలులో మనకు శ్రీ లక్ష్మి గణపతి ఆలయం దర్శన భాగ్యం కలుగుతుంది.ఈ క్షేత్రం చాళుక్య కాలంనాటి చరిత్ర కలది. భూ గర్భంలో ఉండిపోయిన గణపయ్య ఒక భక్తుని కలలో కనిపించి తన గురించి చెప్పాడు.వెంటనే ఆ ప్రదేశాన్ని తవ్విన అక్కడ గణపయ్య కనిపించాడు. విగ్రహం రోజు  రోజుకు పెరుగుతున్నట్టు భక్తులు గమనించి స్వామి వారికి అంగరంగ  వైభవంగా పూజలు చేశారు. భక్తులు తమ కోరికను స్వామి వారి చెవిలో చెప్పి ముడుపులు కడితే తప్పకుండా ఫలిస్తుంది.ఈ క్షేత్రంను దర్శనం చేసుకుంటే ఎల్లప్పుడూ గణనాధుడు తోడుగా ఉండి
కాపాడతాడు.

ఇష్టమైన రంగులు: తెలుపు
ఇష్టమైన పూలు: తెల్లని పూలు,గరిక

నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు.
-తోలేటి వెంకట శిరీష

Leave a comment