మనస్సు వత్తిడి  అతిగా తినేస్తారు కొందరు. అస్సలా వత్తిడి వల్లే చిరాకు పరాకు ఎక్కువై ఎం తోచక తినేస్తారు. అప్పుడే డైట్ విధానాలు మారిపోతాయి జాగ్రత్త అంటారు న్యుట్రీషనిస్టులు. మనస్సులో వత్తిడి  పెరిగితే క్యాలరీలు అధికంగా వుండే పదార్ధాల వైపు మనస్సు లగేస్తూ వుంటుంది. అటువంటి సమయంలో ఓ గ్లాసుడు నీళ్ళు తాగి పది నిమిషాలు వెయిట్ చేస్తే తేడా తెలుస్తుంది అంటున్నారు. ఒక కప్పు హెర్బల్ టీ ఎపిటైట్ ను సంతృప్తి కలిగించడంలో  ఎంతగానో ఉపకరిస్తుంది. ఒత్తిడి సమయాల  కోసం ఆకలి తీర్చగల పోషకాహార పదార్ధాలు సిద్ధంగా వుంచుకోవాలి. అప్పుడే బ్లడ షుగర్  నియంత్రణలో వుంటుంది. ద్రాక్ష, చెర్రీ, టొమాటాల వంటివి ఫ్రిజ్ లో వుంచుకోవాలి. వీటిలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి.

Leave a comment