విపరీతమైన కోపం ,వత్తిడి ఉన్న సమయంలో కఠినమైన వ్యాయామాలు చేయకూడదు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వ్యాయామాల వల్ల వత్తిడి తగ్గి మానసిక శాంతి లభించే మాట నూటికి నూరుసాళ్ళు నిజమే కానీ భావోద్రేకాలకు గురైన సమయంలో కనుక కఠినమైన వ్యాయామాలు చేస్తూ వుంటే హార్ట్ ఎటాక్ వంటివి వచ్చే అవకాశాలు ఉంటాయని పరిశోధికులు గుర్తించారు. ఎమోషనల్ స్ట్రెస్ ఆగ్రహం,రక్త పోటును హార్ట్ రేట్ ను పెంచుతాయి రక్తనాళల్లో రక్తం ఫ్లో మారటం వల్ల గుండెకు రక్త సరఫరా తగ్గుతుంది. అప్పటికే ఫ్లేక్ తో ఆర్టరీ క్లాగ్  అయివుంటే రక్త సరఫరా బ్లాకయి వ్యాయామం తర్వాత గంటలోగా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అధ్యయనకారులు వివరించారు.

Leave a comment