సంతోషంగా,సరదాగా ఎప్పుడు స్నేహితులతో గడుపుతాం కానీ అదంతా మంచి మూడ్ లో ఉంటేనే కానీ ,సరైన మూడ్ లో లేకుండా బాధ, దుఃఖం వేధిస్తూ ఉన్నపుడు ఎవరిని నోపుతూ ఉత్సాహంగా ఉండమని చెప్పటం బావుండదు. కానీ ఎక్సపర్ట్స్ , ఎవరైనా దిగులు ,కష్టంలో ఉన్నపుడు వాళ్ళకి స్నేహితులు,కుటుంబ సభ్యులు మద్దతో చాలా అవసరం దిగులుగా వున్న వాళ్ళ పరిస్థితిని ,సందర్భాన్ని జడ్జ్ చేయద్దు సలహాలు కూడా ఇవద్దు. వాళ్ళు చెపితే సానుభూతిగా ముఖంలోకి చూస్తూ శ్రద్ధగా వింటేచాలు. ఇలాటి చర్య వల్ల నేను తోడుగా ఉన్నానన్న భరోసా ,నైతిక మద్దతో వారికీ ఇచ్చినట్లు అవుతుంది. వీలైతే,మంచి విషయాలు ,మంచి సంఘటనలు వారికీ గుర్తు చేస్తూ మాములు ధోరణతో కబుర్లు చెబితే బావుంటుంది. నెమ్మదిగా దిగులు తిరి మనుషుల్లో పడతారు.

Leave a comment