Categories
వ్యాపారంలో రాణించేందుకు ముందుగా ఆ వ్యాపారం ఇష్టం కావాలి నమ్మకం ఉండాలి .హోటల్ మేనేజిమెంట్ చదివిన అర్పిత యాడ్ ఏజెన్సీ నిర్వహించేది .ఒక పాపాయి పుట్టాక ఆమె బరువు పెరిగింది .అమెరికాలో ఒకసారి షాపింగ్ చేస్తూ బ్రా ఫిట్టర్ ని కలిసింది .ఆమె సూచన మేరకు కొనుకున్న బ్రా షర్టుల తో తనకు సరైన ఆకృతి రావటం గమనించింది .లో దుస్తుల వ్యాపారం పెడితే బాగుండునన్న ఆలోచన వచ్చింది .అమెరికాలో బ్రా ఫిట్టర్ గా బ్రా తయారీలో శిక్షణ తీసుకొంది .క్రౌడ్ ఫండింగ్ సాయంతో లోదుస్తుల బ్రాండ్ బటర్ కప్స్ ని ప్రారంభించింది .ఎన్నో విదేశీ కంపెనీలకు సరఫరా చేస్తూ ది ఇండియాన్ బ్రా లేడీ అనే ప్రత్యేకతను సాధించింది .మనదేశంలో స్ శిక్షణ పొందిన ఏకైక బ్రా ఫిట్టర్ అర్పిత ఒక్కతే .