ఒక్కసారి జుట్టుకు రంగువేశాక మెరుపు పోయిందని అనిపిస్తూ ఉంటుంది . శిరోజాలకు టెక్చర్ ,పొడిబారకుండా కాపాడుకోవాలి అంటే కొబ్బరి నూనె ,ఆముదం సమపాళ్ళలో కలుపుకొని వేడిచేసి జుట్టంతా అప్లయ్ చేయాలి . వేడినీళ్ళలో టవల్ ముంచి బాగా పిండి తలకు చుట్టుకోవాలి . ఇలా హాట్ టవల్ ర్యాప్ ను మూడు నాలుగుసార్లుగా కొనసాగించాలి . దీనివల్ల జుట్టు ,మాడు నూనెను చక్కగా గ్రహిస్తాయి . రాత్రంతా నూనె అలాగే వదిలేసి మరునాడు ఉదయం వాష్ చేసుకోవాలి . తేలికపాటి హెర్బల్ షాంపూ వాడాలి . వాషింగ్ తర్వాత క్రీమ్ కండిషనర్ అప్లై చేసి తేలిగ్గా మసాజ్ చేసుకోవాలి . రెండు నిముషాలు ఆగి నీళ్ళతో కడిగేయాలి మెత్తని టవల్ చుట్టి నీరంతా పీల్చుకొన్నాక వెడల్పాటి దువ్వెన తో చిక్కులు తీయాలి . సన్ స్క్రీన్ గల షాంపూలు కండిషనర్లు వాడితే మంచిది .

Leave a comment