Categories
Nemalika

చెప్పేది, చేసేదీ ఒక్కటై ఉండాలి.

నీహారిక,

నువ్వు  చెప్పిన విషయం ఆచరించదగినదే. తల్లిదండ్రుల ప్రవర్తనే పిల్లలకు ఆదర్శం అని పేరెంట్స్ మేలగాలంటే ఎంత కష్టం. అలాంటప్పుడు పుస్తంకంలో కథల్లా ఉండగలరా? అసలు తల్లిదండ్రులు పిల్లల రిలేషన్ ఎలా ఉండాలి అన్నారు కరక్టే. పిల్లల దృష్టిలో .. ఉండేదాక నటించనక్కర్లేదు. వాళ్లకు మనం సమయం పెట్టగలిగితే చాలు.వాళ్ళ ఆలోచనలు తెలుసుకోవాలి. వాళ్లకు ఏమయినా భరోసా ఇవ్వాలి. క్రమ శిక్షణ విషయంలో పిల్లల ముందు తేలిపోకుడదు. ఎలాంటి ప్రవర్తన తో ఉండాలనేది పిల్లలకు వివరంగా చెప్పాలి కానీ దండించి చెప్తే సరిపోదు. అలాగే తల్లిదండ్రుల్లో ఒకళ్ళు పిల్లలకు ఏదైనా చెప్పాలనో, కోప్పడలనో అనుకుంటే రెండోవాళ్ళు అడ్డు రావద్దు. మంచి ప్రవర్తన ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు పొగడాలి. మెచ్చుకోవాలి. ఆ సంతోషాన్ని చిన్న చికాకులతో షేర్ చేయాలి. అయితే ఒక్కటి మాత్రం నిజం తల్లిదండ్రులు రోల్ మోడల్స్ గ ఉండాలంటే మాత్రం చెప్పే మాటలకూ, చేసే దానికి పరస్పర విరుద్దంగా మాత్రం ఉండొద్దు. పిల్లలకు అబద్దాలు ఆడితే,తిట్టేకొద్ది దండిస్తేనో వాళ్ళు నిమిషానికొ అబద్దం చెపితే పిల్లలు ఇంకా నేర్చుకోవడానికి ఏముంటుంది చెప్పండి?

Leave a comment