కేంద్ర ప్రభుత్వం 2014 లో తీసుకొచ్చిన బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం, ఇప్పటి వరకు బాలికలసంక్షేమం కోసం తీసుకు వచ్చిన అత్యుత్తమ ఫలితాలు ఇచ్చిందని మేనకా గాంధీ ఇటీవల పార్లమెంట్ ఈ పధకం ప్రగతి గురించి వివరంగా చెప్పారు. ఈ పధకం వల్ల బాలికల లింక  నివృత్తి అతి తక్కువగా వున్న హరియానా వంటి రాష్ట్రాల్లో గణనీయమైన అభివృద్ధి కనిపించిందని అన్నారు. ఇక్కడి కర్నల్ జిల్లాలో ఒకప్పుడు వెయ్యి మందిమగపిల్లలకు 758 మంది ఆడపిల్లలు వున్నారట. ఈ పధకం తర్వాత ఆ సంఖ్య 884 గా పెరిగిందిట. తమిళనాడులోని కడలూరు 856 నుంచి 957 కు, ఉత్తర ప్రదేశ్ లోని మజయాబాద్ లో 899 నుంచి 977 కు’, పంజాబ్ లోని మాన్సీ 857 నుంచి 925 కు సంఖ్య పెరిగిందని చెప్పారు. అన్నింటి కన్నా ఉత్తర సిక్కిం అగ్ర శ్రేణిలో వుంది. ఇక్కడ లింగా నిష్పత్తి వెయ్యి మందికి 831 మాత్రమే కాగా ఇప్పుడు 1009 కు పెరిగిందని మేనాకా గాంధీ చెప్పారు.

Leave a comment