వేసవి ఎండల కు పిల్లలు లేత శరీరాలు తేలికగా ఎండదెబ్బకు గురవుతారు వారికి వేసే దుస్తులు మొదలుకొని అందించే ఘన ద్రవ పదార్థాలు విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఆరు నెలల లోపు పిల్లలకు తల్లిపాలు తప్ప ఇంకేం ఇవ్వనవసరం లేదు తల్లిపాలు ద్వారానే వారి దాహం తీరుతుంది తల్లిపాల తోనే వేసవి ఎండలను తట్టుకునేందుకు శక్తి వస్తుంది. పిల్లలు మూత్రం నీరులా స్వచ్ఛంగా ఉంటే వారికి సరిపడే నీరు అందుతుందని గ్రహించవచ్చు. ఆరు నెలల దాటి ఘన హారం మొదలు పెట్టిన పిల్లలకు కొబ్బరి నీరు,చెక్కెర  కలపని తాజా పండ్ల రసం తాగ్గించవచ్చు పండ్ల ముక్కలు గుజ్జు గా చేసి తినిపించవచ్చు 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా ఏ సి  సెట్ చేసుకోవాలి .ఎయిర్ కూలర్ లు వాడకపోవటం మంచిది.

Leave a comment