ప్యాచ్ వర్క్ ఎప్పుడూ బావుంటుంది. దేన్నయినా ఫ్యాషన్ గా మార్చేస్తుంది. ఒక సాదాసీదా డ్రెస్ కు ఎన్నెన్నో డిజైన్ లు అతికించి ట్రెండిగా మార్చేస్తుంది. ఈ వర్క్‌ ఇప్పుడు పెద్ద కష్టం కాదు. ఐరన్ ఆన్ ప్యాచెస్ వచ్చేశాయి మార్కెట్లోకి దీన్ని ప్యాంట్ పైనో షర్ట్ పైనో అతికించేయవచ్చు. పులులు,సింహాలు,లోగోలు,పువ్వులు,అక్షరాలు ఎన్నో ప్యాచెస్ వీటిని పెట్టి ఐరన్‌ చేస్తే చాలు ఎక్కడ కావాలంటే అక్కడ అతుక్కుపోతాయి. చిల్లులు.మరకలతో పక్కన పడేసిన పాత డ్రెస్ లు అయినా ఈ ప్యాచ్ లు అంటిస్తే కొత్తగా వార్డ్ రోబ్ లో పెట్టేయవచ్చు.

Leave a comment