శిశువులను,పశువులను ఒకే రకంగా గానం అలరిస్తుంది అంటారు. కాని ఇప్పుడు కొత్త పరిశోధనలో గానం ఒక చికిత్స అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఉటా హెల్త్ పరిశోధకులు. సంగీతం కారణంగా అల్జీమర్స్ రోగుల పాత జ్ణాపకాలు తిరిగి తెప్పించవచ్చు అంటున్నారు. క్రమం తప్పకుండ పాటలు వినిపిస్తే వాళ్ళలో మతిమరుపు తగ్గి ఆలస్యంగా అయినా పాత విషయాలు గుర్తుకు తెచ్చుకోవడం పరిశోధనలో గమనించాం అంటున్నారు. ఆలోచన శక్తి క్షీణించకుండ పదే పదే పాత పాటలు కూడా వింటూ ఉండటం మంచిదే అంటున్నారు. అందుకే చక్కగా పాటలు వింటే మనకు ఎప్పటి విషయాలనో కళ్ళముందుకు ఉంచుకుంటుది. మతిమరుపు దూరం అవుతుంది.

Leave a comment