లక్మీ హారాలు,పాత తరం నగలు ఆ కాలంలో నగల్లో కూడా దేవతామూర్తులు దర్శనం ఇచ్చేవి. ముఖ్యంగా లక్ష్మీదేవి నగల్లో కొలువై ఉండేది. ఇప్పుడు అవే నగలు ఫ్యాషన్ కు ప్రతిరూపాలు అయ్యాయి. లక్ష్మిదేవి చోకర్ నెక్లెస్ లో మొత్తం అమ్మవారి బొమ్మలే మెడ చుట్టు వస్తాయి. వజ్రాలు,కెంపులు,రత్నాలు,ముత్యాలు పొదిగిన ఈ హారం చాలా బావుంటుంది. అలాగే లక్ష్మీరూపంలో హారాలు మ్యాచింగ్ గా దిద్దులు,గాజులు వస్తున్నాయి. వన్ గ్రామ్ గోల్డ్ లోనూ లక్ష్మీ రూపాలే. సంపదగా ఆది దేవతగా ఉన్న లక్ష్మీదేవి నగలో కూడా ఒక్క నవ్వుతో కనిపిస్తే గొప్ప దీవెన ఐపోదు.

Leave a comment