Categories
WhatsApp

యాంటీ ఏజింగ్ సప్లిమెంట్స్ వేస్ట్.

యాంటీ ఏజింగ్ సప్లిమెంట్స్ తీసుకున్నా సరే కొంచెం వయస్సు పెరుగుతున్న కొద్దీ హుషారు తగ్గుతూ అలసట కమ్మేస్తూ వుంటుంది. దీన్ని సహజ సిద్ధంగా ఎలాంటి సప్లిమెంట్లు తీసుకోకుండా రీచార్జ్ చేసుకోవాలి. తక్కువ ఐరన్ వుందని ఖచ్చితంగా డాక్టర్ సలహా ఇస్తేనే తప్ప ఐరన్ సప్లిమెంట్స్ వద్దు అదనంగా విటమిన్ తీసుకున్నా కణాలు సూపర్ చార్జ్ అవవు. ఎక్కువసేపు శరీరానికి శక్తి ఇచ్చే పదార్ధాలే తీసుకోవాలి. షుగర్, బెకరీ ఐటమ్స్ ఎక్కువ కేలరీలు పోగు చేసి ఇబ్బంది తెస్తాయి. వీటి బదులు తక్కువ కొవ్వు వుండే పెరుగు, నట్స్ కిస్మిస్, తేనె వంటివి బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాలి. శరీరం ఫైబర్, ప్రొటీన్ల మిస్రమాన్ని నెమ్మదిగా గ్రహిస్తుంది. కార్బోహైడ్రేడ్స్, ప్రోటీన్స్ గల ఆహారం లంచ్ లో తీసుకుంటే మంచిది. మంచి ఆరోగ్య వంతమైన భోజనం చేయాలి.

Leave a comment