జుట్టు ఆరోగ్యం కోసం ఖరీదైన షాంపూలు నూనెల కంటే కొన్ని సహజ పదార్థాలు బాగా పనిచేస్తాయి. విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరి పొడి కురులకు బలం ఇస్తుంది .కప్పు ఉసిరిపొడి లో పావు కప్పు ఆముదం అర కప్పు కొబ్బరి నూనె స్పూన్ మెంతులు వేసి మరిగించాలి చల్లారాక వడగట్టి పొడిగా ఉండే సీసాలో భద్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ నూనెతో మర్దనా చేస్తే ఫలితం కనిపిస్తుంది. శీకాయి కుంకుడు కాయలు  జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ కాయల్ని వేడినీళ్లలో మరగనివ్వాలి అందులో గుప్పెడు మందార ఆకులు పువ్వులు కూడా వేయాలి బాగా కాచిన తర్వాత వడకట్టి నీళ్లతో తలస్నానం చేస్తే జుట్టు మెత్తగా మారిపోతుంది .

Leave a comment