మనిషి అన్నాక ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. ప్రతి చిన్న దానికీ వైద్యుల దగ్గరకు పరుగు తీయకుండా ఎన్నో చిట్కా వైద్యాలు చేస్తుంటారు. ఒక్కో దేశంలో ఒక్కో చిట్కా పద్ధతులున్నాయి. క్యుబెక్ లో పంటి నొప్పి వస్తే అక్కడ దొరికే ఆకుపచ్చని ఆకులు నములుతారు. మన దగ్గర తులసి ఆకులను నమినట్లు ఉంది కదు. ఎండకి చర్మం కమిలిపోతే టీ ని కమిలిన భాగంపైన చల్లుకొంటారట తైవాన్ వాళ్ళు.టీ లోని టానిక్ ఆసిడ్ చర్మం పైన కమిలిన భాగానికి ఉపశమనం ఇచ్చి చర్మాన్ని సాధారణ స్థాయికి తెస్తుంది. మాడు పైన చుండ్రు కనిపిస్తే కెనడా వాళ్ళు రెండు స్పూన్ల వెనిగర్ ని నీళ్ళతో కలిపి దాన్ని చుండ్రు ఉన్నచోట పోసి ఆ తర్వాత స్నానం చేస్తారట.కళ్ళకు ఆరోగ్యం ఇచ్చే శక్తి పీ నట్స్ కు ఉందని చైనీయుల నమ్మకం. నట్స్ లోని విటమిన్స్ నేత్రనాడి పనితీరును మెరుగుపరుస్తుంది. ఎక్కిళ్ళు వస్తుంటే నార్వే వాళ్ళు ఒక ఐస్ ముక్క తీసుకొని గొంతు మధ్యలో ఉబ్బెత్తుగా వుండే భాగంపైన ఓ నిమిషం పెట్టుకొంటారు. ఎక్కిళ్ళకు కారణమైన మెదడు సందేశాన్ని విభాజక పటాలానికి చేరవేసే నాడి ఆ భాగం నుంచి వెళుటుందిట. ఐస్ చల్లదనం ఆ నాడీ సందేశాన్ని ఆపుతుంది. ఇది వైద్య శాస్త్రం ధృవికరించిందే. వెతికితే ఎన్నో ఉన్నాయి ఇలాంటి పద్ధతులు.

Leave a comment