అర్ధరాత్రి దాకా టీవీ చూస్తూ కంప్యూటర్లు ముందర కూర్చుని తెల్లవారి నిద్రలేవకుండా పడుకోవటం చాలా మందికి అలవాటు. అయితే ఇలా చేస్తూ ఉదయపు ప్రయోజనాలు మిస్ అవుతున్నావంటారు. డాక్టర్లు. ఉదయపు వేళ వ్యాయామఫలితాలు ఎక్కువగా ఉంటాయి. యోగా కి ఉదయపు వేళలో ప్రశాంతమైన సమయం ఆసనాలు వేసినా జాగింగ్ బ్రిస్క్ వాక్ వాకింగ్ ఏది చేసినా ఆరోజుకి సరిపడా ఉత్పాదక శక్తీ పెరుగుతుంది. జీవక్రియ స్థాయిలు పెరుగుతాయి. హడావుడి గా పరుగులు తీస్తూ చేసుకునేవాళ్ళు పిల్లల అల్లరి వాహనాల శబ్దాలు ఏవీ ఉండవు. రోజు మొత్తంలో ప్రశాంతమైన సమయం తెలతెలవారే సమయాలే. అందుకే ఉదయాన్నే ప్రశాంతంగా ప్రారంభించి ఆరోజంతటినీ ప్లాన్ చేసుకోమంటున్నారు డాక్టర్లు.

Leave a comment