Categories
బ్లూ బెర్రీలు, ద్రాక్ష,పల్లిలో ఎక్కువగా రెస్ వెరాట్రాల్ అనే పదార్థం ఉంటుంది. ఈ పదార్థం గుండె ఆరోగ్యానికే క్యాన్సర్ల నివారిణిగా ఎంతో మంచి దంటారు పరిశోధికులు అయితే ఈ మధ్య కాలంలో బ్రిటన్ లోని కింగ్ కాలేజీ లండన్ కు చెందిన పరిశోధికులు చేసిన ఒక పరిశోధనలో అది బీ.పి తగ్గేందుకు ఎంతగానో ఉపయోగ పడిందని చెబుతున్నారు.రెస్ వెరాట్రాల్ ఒక ఆక్సిడెంట్గా పనిచేసి రక్త నాళాల్లో ఒత్తిడిని తగ్గేల అవి వ్యాకోచించేలా చేస్తుందని దీంతో రక్త సరఫరా చక్కగా ఉంటుందని పరిశోధన ఫలితాలు చెబుతున్నాయని చెప్తున్నాయి. ఈ రెస్ వెరాట్రాల్ సమృద్ధిగా ఉండే ద్రాక్ష బ్లూ బెర్రీలు పల్లీలు వంటివి ప్రతిరోజు ఆహారంలో ఉండేల చూసుకోమంటారు.