గోవిందాశ్రిత..గోకులబృంద….పావన జయ జయ పరమానంద!!

బాలాజీ అంటేనే గుర్తు వచ్చేది తిరుపతి కదా!!

ఆ స్వామిని….ఏడు కొండల వెంకన్న,ఆపదలు కాసేవాడు,పన్నగశయన,నాగభూషణ..ఎలా పిలిచినా పలుకుతాడు.ప్రత్యక్షంగా కనిపించడు కానీ పరోక్షంగా ఆపదలు కాస్తాడు.శ్రీవారికి శనివారం, మంగళవారం ప్రీతి కరం.శనివారం అత్యంత ఇష్టం.శేషతల్పశాయికి తలనీలాలు సమర్పించిన ఎంతో పుణ్యం.ప్రతి శనివారం పదకొండు రుపాయలు,కర్పూరం స్వామి వారి హుండీలో వేస్తే కోరికలు ఇట్టే తీరుస్తాడు.
వేంకటేశ్వర స్వామికి పదకొండు ప్రదక్షిణాలు చేస్తే మంచిది. కోరిక తీరిన తరువాత నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేయాలి.స్వామి మంచి అలంకార ప్రియుడు. ఎల్లవేళలా పూలతో అలంకరించి ఉంటాడు.
బ్రహ్మోత్సవాలలో పది రోజుల అలంకరణ చూడడానికి రెండు కళ్ళూ చాలవు సుమా!!
ఇష్టమైన రంగుల: అన్ని రంగులు ఇష్టమే.
ఇష్టమైన పూలు: ధనుర్మాసంలో తులసిమాలలు, దసరాలో బంతి-చేమంతులు,కదంబం అన్ని రకాల పూలు స్వామి వారి సొంతం.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పులిహోర, దద్ధోజనం.
పులిహోర తయారీ: నీళ్ళు ఎసరు పెట్టుకోవాలి, కాగిన నీళ్ళలో కడిగిన బియ్యం వేసి ఉడికించి,గంజి వార్చి పక్కన పెట్టుకోవాలి. చింతపండు గుజ్జు తీసి దానిలో తగినంత ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసి ఉడికించిన తరువాత అన్నం కలిపి, నూనె వేడి చేసి ఆవాలు, శనగ పప్పు,మినప్పప్పు, ఎండుమిరపకాయల్ని,పసుపు, ఇంగువతో పోపు పెట్టుకోవాలి. చివరిగా కర్వేపాకు తో పులిహోర సిధ్ధం.మామిడికాయ  పులిహోర, నిమ్మకాయ పులిహోర కూడా సమర్పించచ్చు.
దద్ధోజనం తయారీ:గట్టి పెరుగు తీసుకొని అందులో తగినంత ఉప్పు,కర్వేపాకు వేసి,ఉడికించిన అన్నం చల్లారిన తర్వాత పెరుగులో కలిపి,నేయ్యి లో ఆవాలు, జీలకర్ర,కొద్దిగా మిరియాల పొడితో ఘాటైన పోపుపెట్టుకోవాలి. వేయ్యించిన జీడిపప్పుతో స్వామి వారి ప్రసాదం తయారు మరి. -తోలేటి వెంకట శిరీష.

Leave a comment