ఉదర సంబంధిత సమస్యలు నివారించే వాము నీరు పరిగడుపునే తాగమంటున్నారు ఆయుర్వేద వైద్యులు. కొద్దిగా వాము వేసి అందులో కాస్త తేనె కలుపుకొని తాగచ్చు. రెండు కప్పులు మరగే నీళ్లలో ఒక స్పూన్ వాము ఒక స్పూన్ జీలకర్ర వేసి పది నిమిషాలు మరగనిచ్చి దాన్ని వడగట్టి తేనె కలుపుకొని తాగాలి. కప్పు మరగే నీళ్లలో టీ స్పూన్ వాము గింజలు వేసి వాము టీ  కూడా తాగచ్చు. వాము మంచి ఎప్టైజర్.అలాగే  ఊపిరితిత్తులకు ఎంతో మేలు చేస్తుంది.

Leave a comment