సెంట్లు పెర్ ఫ్యూమ్స్ వాడటం కామనే. ఏదైనా వేడుక కోసం బయటకు వెళ్ళేటప్పుడు అలంకరణ తర్వాత ఎదో మంచి పరిమళం రావాలనే ఉద్ద్యేశంతో రకరకాల సెంట్లు ట్రై చేస్తాం. ఇప్పుడు ఎక్స్ పెర్ట్లు ఇలా పార్టీలకు పెళ్లిళ్లకు వెళ్ళేటప్పుడు నిమ్మ గుణాలున్న సెంట్ ఎంచుకోమంటున్నారు. ఈ  సిట్రస్ పరిమళంతో నిమ్మ నారింజ ద్రాక్ష ను గుణాలు ఉంటాయి. ఏ షాపింగ్ కు వెళుతుంటే కూడా ఎక్కువసేపు తిరిగినా ఈ పరిమళం చుట్టుముట్టే ఉంటుంది. అలాగే గంధపు చెక్కతో కూడిన పరిమళం కూడా ఎక్కువసేపు ఉంటోంది. అమ్మాయిలు సాధారణంగా పువ్వుల సుగుణాలున్న పరిమళం కూడా ఎక్కువ ఇష్టపడతారు. లిల్లీ గులాబీ లావెండర్ లాంటివి ప్రత్యేకంగా తెలుస్తాయి. ఇప్పుడు యాపిల్ మామిడి పండ్ల సువాసనతో కూడా పెర్ఫ్యూమ్స్ వస్తున్నాయి. ఈ పువ్వుల పండ్ల కలయిక తో కూడిన సువాసన చాలా మందికి ఇష్టం. వీటికి తోడు స్పైసీ సెంట్స్ కూడా వస్తున్నాయి. లవంగాలు దాల్చిన చెక్క మిరియాల వాసన లున్న సువాసన కూడా మార్కెట్ లో ఉన్నాయి. ఏ సెంట్  అయినా మణికట్టు పైన కొడితేనే వాసన ఎక్కువసేపు ఉంటుంది.

Leave a comment