మాట వెండి అయితే మౌనం బంగారం అంటారు. మౌనం ఒక ధ్యానం అంటారు తత్వవేత్తలు. ఆధునిక యుగంలో మాటలు ఎక్కువయ్యాయి. నిద్రలోనూ మాట ఆగిపోదు స్వప్నంలో కూడా మాట్లాడుతూనే ఉంటారు. మనసుతో మౌనం పాటించటం అత్యవసరం మౌనం సంగీతం కంటే ఎక్కువ విశ్రాంతి ఇస్తుందంటారు. ధ్యానం విషయంలో మెదడు శరీరాలు వింటాయో అదేవిధంగా మౌనం గా ఉన్నప్పుడు స్పందిస్తాయి. ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తాయి. శ్వాస వేగాన్ని తగ్గిస్తాయి. దానితో ఏకాగ్రత ప్రశాంతత చేకూరుతాయి తక్కువ తక్కువ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. వాళ్ల మెదళ్ళు బలంగా సమర్థవంతంగా ఉంటాయి. అప్పుడప్పుడు మౌనంగా ఉండటం మెదడుకు మేలు చేస్తుంది. మహాత్మాగాంధీ మౌనం పాటించేవారు అని అందరికి తెలిసిందే. వాచాలత్వం కంటే మౌనం వెయ్యి విధాల మేలు.

Leave a comment