విశ్వసుందరి  సంధు గ్రాండ్ ఫినాలే లో ధరించిన సిల్వర్ గౌను రూపొందించింది డిజైనర్ సైషా షిండే 40 ఏళ్ల నైషా షిండే ఇండియాలోని అతి కొద్ది మంది ట్రాన్స్ జెండర్ ఫ్యాషన్ డిజైనర్ లలో ఒకరు. గత పదిహేను సంవత్సరాలుగా బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ గా రాణిస్తోంది. ముంబై కి చెందిన సైషా షిండే, హ‌ర్నాజ్ కోరిక మేరకు పుల్కారీ ప్యాట‌ర్న్‌ కు ఎంబ్రాయిడరీ స్టోన్స్ సీక్వెన్స్ లను జోడించి పంజాబీ సాంప్రదాయపు గౌను తయారు చేసింది. తను తయారు చేసిన సిల్వర్ గౌన్ ధరించి మిస్ యూనివర్స్ కిరీటం సాధించిన హ‌ర్నాజ్ సంధు తన కలను నిజం చేసింది అంటుంది సైషా షిండే. ఎప్పటికైనా మిస్ యూనివర్స్ ధరించే డ్రెస్ డిజైన్ చేయటం తాను కలగన్నానని చెబుతోంది సైషా షిండే.

Leave a comment