ఒక ఏడాది పాటు అమెరికా విమానంపై యాషికా ఖత్రి పేరు కనువిందు చేయనుంది. ఒక విదేశీ విమానంపై మన త్రివర్ణ పతాకం  రెపరెపలాడటం చూడగలుగుతాము ఖత్రి పేరు తో పాటు భారత జాతీయ పతాకం బొమ్మ కూడా ఉండటం గర్వకారణమని ఖత్రి పై ప్రశంసల వర్షం కురుస్తోంది. హరియాణా లోని కురుక్షేత్ర కు చెందిన  యాషికా ఖత్రి అమెరికాలోని అరిజోనా రాష్ట్రం లోని ఎంబ్రి-రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ పోటీల్లో నెగ్గి మిలియా ఎయిర్ హార్ట్ స్కాలర్ షిప్ పొందింది. పది వేల డాలర్ల నగదు పురస్కారం కూడా ఆమెకు లభిస్తుంది. ఎంబ్రి-రిడిల్ యూనివర్సిటీ లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఏరోనాటికల్ డిసి ప్లెయిన్ పై అక్కడ పిహెచ్.డీ  చేస్తోంది. కల్పనా చావ్లా కూడా ఇక్కడే చదువుకున్నారు.

Leave a comment