చీరకట్టుకు ప్రచారం కలిగించే ఉద్దేశంతో 6 యార్ట్స్ అండ్ 315 డేస్ పేరుతో ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేశారు ఢిల్లీకి చెందిన 67 సంవత్సరాల సునీత బుది రాజ. వ్యాపార రీత్యా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నో అరుదైన డిజైన్స్ తో ప్రత్యేకమైన చీరలను తయారుచేసే చేనేత కారులను చూసి ఆశ్చర్య పడ్డారామె. చేనేత ఉత్పత్తులకు సాయం కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఫేస్ బుక్ పేజ్ క్రియేట్ చేసి చీరెల గురించి అభిప్రాయాలు పంచుకోవటం ప్రారంభించారు.ఇప్పటికీ 40 వేల మంది సభ్యులు ఉన్నారు ఇందులో చేనేత కార్మికులకు మహిళలకు వారధిగా పని చేస్తుంది ఈ ఫేస్ బుక్ పేజి.70 దేశాల్లో సమావేశాలు నిర్వహించారు ఫ్యాషన్ షోలు  క్రౌడ్ ఫండింగ్ తో నగదు, కార్మికులకు ఉచితంగా స్టాల్స్ పెట్టుకునే అవకాశాలు కల్పించారు.

Leave a comment