పుల్లగా ఉండే చింతచిగురు లో యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. వారానికి రెండుసార్లు ఈ పుల్లని ఆకు తో ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మానికి మాయిశ్చరైజర్ అందుతోంది. కప్పు చింత ఆకుల్లో కప్పు బొప్పాయి పండు ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంతో ముఖంపై ప్యాక్ వేసుకుని 20 నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేయాలి. క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం పైన ముడతలు మచ్చలు చర్మ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

Leave a comment