బంగారు హారాలు లో పగడాలు కూర్చిన నగలు ఇవ్వాల్టి ట్రెండ్. నవరత్నాల్లో ఒకటైన పగడాన్ని బంగారు గుళ్ళతో కలిపి హారంగా వేసుకుంటారు. కానీ ఎర్రని పగడాలను గుత్తులుగా మలచి బంగారు నగల్లోకి తెచ్చేశారు ఫ్యాషన్ ఎక్సపర్ట్స్. హారాలు, నెక్లెస్ లు, గాజులు చెవి దిద్దులోకి పగడాలు వచ్చి ఒక కొత్త లుక్ తీసుకొచ్చాయి. టెంపుల్ జ్యువెలరీ దగ్గరనుంచి సన్నటి గొలుసు ల వరకు అన్నింటిలోనూ పగడాల ఆభరణాలు స్పెషల్ గా కనిపిస్తున్నాయి. పగడాల గుత్తి పూల హారం మ్యాచింగ్ గా వజ్రాలు తో కలిపి పగడాలు పొదిగిన దిద్దులు  ఇప్పటి ఫ్యాషన్.. సాదా పగడాల దండ పెద్ద పెండెంట్ తో కొత్త కోరల్ పూసల నాగ గా మారిపోయింది.

Leave a comment