Categories
గోద్రెజ్ అండ్ బాయ్స్ సంస్థకు భవిష్యత్తు వారసురాలిగా ఎంపికైంది నైరిక హోల్కర్, తాజాగా ఆసియా పవర్ బిజినెస్ ఉమెన్ 2024 జాబితాలో స్థానం సంపాదించారు. అమెరికాలోని కొలరాడో కాలేజీలో ఫిలాసఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. లండన్ లో న్యాయశాస్త్రాన్ని చదువుకుంది. 2017 లో ఆమె ఓ ఈజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరుగా నియమితురాలయింది. నైరిక లండన్ భారత్ లాఫర్న్ లో పనిచేసింది. తమ కంపెనీలు వ్యూహాత్మక ప్రణాళిక లో కీలక పాత్ర పోషిస్తూ బ్రాండింగ్, డిజిటలైజేషన్ లీగల్ వ్యవహారాలు విలీనాలు,కొనుగోళ్లు మొదలైన అంశాలలో చురుకైన నిర్ణయాలు తీసుకుంటూ కంపెనీని పరుగులు పెట్టిస్తోంది నైరిక.