Categories
34 సంవత్సరాల లోజినా సలా మిస్ యూనివర్స్ ఈజిప్ట్ గా ఎంపికై మాతృదేశానికి గౌరవం తెచ్చి పెట్టింది. అందాల పోటీలో పాల్గొన్న తొలి విటిలిగో వ్యాధి గ్రస్తురాలు. 8 ఏళ్ల వయసులో బొల్లి సోకిన ఈమె తన అనారోగ్యాన్నీ మనస్ఫూర్తిగా అంగీకరించి, చక్కగా చదువుకున్నది. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయింది. యూనిసెఫ్,ఫోర్ట్స్ తో కలిసి మహిళా సాధికారత కోసం పనిచేసింది ఆమె కృషికి ది మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఉమెన్ వంటి అవార్డులు వచ్చాయి. తాజాగా ఈజిప్ట్ కు ప్రాతినిధ్యం వహిస్తూ అందాల రాణి కిరీటం గెలుచుకుంది.