వర్షం రోజుల్లోనో రాబోతుందన్న చలికాలంలోను తడిగా ఇంటి మూలాలు చల్లగా ఉంటాయి కనుక క్రిమి కిటాకాల ఇబ్బంది ఎక్కువే. చుట్టు పచ్చదనం ఇంటికి మంచిదే కాని ఇంటి చుట్టు దట్టంగా ఉండే చెట్ల ఆకులు కీటాకాలకు నిలయంగా ఉంటాయి. ఆకులు కింద దోమలు గుడ్లు పెడతాయి. కుండీలలో మొక్కలకు కూరగాయ తొక్కలు, టీ పోడి వేస్తూంటారు. మొక్కలకు ఎదుగుదలకి ఇవి మంచివే కాని వీటివల్ల పురుగులు,చీమలు వచ్చేస్తాయి.ఇంట్లో ఎక్కడైన పగుళ్ళు ఉంటే ఇవన్ని అక్కడికి చేరుకుంటాయి. గోడలు,సీలింగ్ ఫ్లోర్లలో ఎక్కడ పగుళ్ళు ఉన్న వెంటనే బాగు చేయించాలి.చీపుర్లు,వ్యాక్యూమ్ క్లీనర్లు ఎప్పుడు వాడుతూ,సాలే గూళ్ళు తీసేస్తు ఇంటి మూలలు క్లీన్ చేస్తు ఉండాలి. ఇళ్ళు ఎంత శుభ్రంగా అంతగా క్రిమి కిటాకాలు రావు.

Leave a comment