ట్రాన్స్ జెండర్ సెనేటర్ గా మిగిలిపోవాలని లేదు ప్రజలకు ఒక సెనేటర్ గా సేవలందిస్తాను.ట్రాన్స్ జెండర్ ను కావటం కేవలం యాదృచ్చికం అంటోంది సారా మెక్ బ్రైడ్.అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో డెలావేర్ రాష్ట్రం నుంచి సెనేటర్ గా ఎన్నికయ్యారు సారా. డెమోక్రాట్ల కు కీలకమైన ఈ ప్రాంతం నుంచి గెలవటం గొప్ప విజయం పౌర సమస్యల పరిష్కారానికి విభిన్న లైంగిక వర్గాలకు సమాన హక్కులు కల్పించే ఈక్వాలిటీ బిల్లు కోసం పోరాటం కొనసాగిస్తాను. అందరికీ తగిన ఉపాధి అవకాశాలు లభిస్తే సమాజంలో అణచివేత వర్గాల వారికి గౌరవం పెరుగుతుంది హింసాత్మక ధోరణి తగ్గుతాయి. ఇది సాధించాలంటే రాజకీయధికారమే మార్గం అంటోంది సారా మెక్ బ్రైడ్. అమెరికాలో సెనెట్ కు ఎన్నికైన మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ గా చరిత్ర సృష్టించారు సారా.