ఈ చలి రోజుల్లో అన్ని రకాల వైరస్ లు సోకే ప్రమాదం ఉంటుంది.కొన్ని రకాల కషాయాలు ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా వైరస్ ల నుంచి కాపాడేవిగా ఉంటాయి.కుంకుమపువ్వు, పుదీనా కషాయం, తులసి కషాయం, శొంఠి  మొదలైన కషాయాలు ఈ రోజుల్లో రోజుకు ఒకసారైనా తాగాలి కుంకుమపువ్వు యాలుకలు దాల్చినచెక్క అల్లం దినుసులన్నీ నీళ్లలో వేసి మరిగిస్తే చాలు.అలాగే తులసి కషాయం తులసి ఆకులు అల్లం మిరియాలు కలిపి నీళ్లలో మరిగించాలి శొంఠి, జీలకర్ర, ధనియాలు, తులసి ఆకులు, తాటి బెల్లం నీళ్లలో మరిగిస్తే కసాయం తయారవుతోంది.ఈ మిశ్రమాలతో చేసే కషాయాలు ఎక్కువ నీళ్లలో,వెడల్పయిన పాత్రలో సగానికి సగం నీళ్ళు మరిగించి ఆవిరై పోయేదాకా ఉడికించాలి.అన్నింటి లోనూ రుచికోసం తేనె బెల్లం నిమ్మరసం మొదలైనవాటిని కలుపుకోవచ్చు.

Leave a comment