వంట గదిలో గిన్నెలు మాడిపోవటం ప్రతి ఇంట్లో అనుభవమే అలా మాడిన గిన్నెను శుభ్రం చేయాలంటే గిన్నెలో సగం కంటే ఎక్కువ నీళ్లు పోసి వంట సోడా రెండు స్పూన్ల నిమ్మరసం లేదా వెనిగర్ కలిపి ఐదు నిమిషాలు ఎక్కువ సెగపై వేడి చేసి తర్వాత సన్నని మంటపై నీటిని మరగనివ్వాలి. గరిటతో తిప్పితే అడుగు మాడిన పదార్థాలు విడిపోయి నీళ్లు మరుగుతూ ఉండగానే స్పూన్ తో గీరేస్తే మాడిన గిన్నె మామూలుగా అయిపోతుంది. తర్వాత క్లీనింగ్ సోప్ తో శుభ్రం చేసి హాయిగా వాడుకోవచ్చు.

Leave a comment