అమ్మాయిల హాండ్ బ్యాగ్ కేవలం అందంగానే కాకుండా అందులో ఉంచుకొనే వస్తువులు ఏ సమయంలో అయినా ఉపయోగపడేలా ఉండాలి. ముఖ్యంగా అందులో రెండు శానిటరీ నాప్ కీన్స్ తప్పసరి. చిన్న దువ్వేన,అద్దం ,మాయిశ్చరైజర్ కూడా కాస్త ఫ్రెష్ గా ఉంచేందుకు ఉపయోగమే. తప్పని సరిగా టిష్యూ పేపర్స్ ఉంచుకోవాలి. అందంగా ఉందికదా అని పెట్టుకొన్న క్లిప్స్ ఏ నిమిషంలో అయినా కాస్త వదులై జుట్టు జారీ పడిపోతూ ఉండవచ్చు. ఓ రబ్బర్ బ్యాండ్ క్లిప్స్,కొన్ని సేప్టీ పిన్స్ తప్పని సరిగా ఉంచుకోవాలి. వందల రూపాయలు ఉన్న సరే ఒక్కసారి ఒక్క పది రూపాయాల చిల్లర కోసం చాలా అవసరం వస్తుంది. ఎన్నీ కార్డులున్న సరే కొన్నీ రూపాయలు ,చిల్లర పర్సులో ఉండి తీరాలి వీటిని ప్రతి రోజు చెక్ చేసుకోవాలి.ఇంట్లోంచి కాలుబయట పెట్టాకా ఎలాంటి అవస్థలు రాకుండా కాపాడతాయి ఈ చిన్న వస్తువులు.
Categories