Categories
డాక్టర్లు కూడా మధుమేహం ఉన్నవాళ్ళకు కృత్రిమ షుగర్లు సిఫార్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సార్టీమ్ , ఎస్ సల్ఫెమ్ పొటాషియం వంటి క్యాలరీలు లేని కృత్రిమ షుగర్ల వాడకం ఎక్కువైంది. అలా శరీరంలోకి క్యాలరీలను పంపటం తగ్గించుకుంటున్నామని అనుకుంటున్నారు కానీ ఇవి స్థూలకాయానికి దారీ తీస్తున్నాయని వీటితో షుగర్ ఎక్కువవుతుందని చెబుతున్నారు. వీటి వల్ల శరీరంలో వచ్చే జీవరసాయన మార్పులు నరాల వ్యవస్థను దెబ్బతీయటంతో పాటు రక్తనాళల లోపలి పొరను పాడు చేస్తున్నాయని చెబుతున్నారు. వీటి కంటే సహజమైన పంచదార కొంత నయం అంటున్నారు. తక్కువ మోతాదులో సహజ షుగర్లనే వాడుకోమంటున్నారు.