ఉదయం నుంచి సాయత్రం వరకు వంగి లేచి టేబుల్ పైన వాలిపోయి ఫోన్ మాట్లాడే ఇలా అన్ని పనుల్లోనూ ముందుకు వంగే వుంటాం కనుక దీని వల్ల వెన్నుముక పైన వెన్నుపాము పైన నిరంతరం వత్తిడి తగిలి కండరాల సమస్యలు వేధిస్తాయంటున్నారు వైద్యులు. శ్రమ లేని తనం వల్ల ప్రధాన సమస్య జీర్ణక్రియ కుంటుపడటం ఆకలి తగ్గిపోయి తీసుకునే పోషకాలు తగ్గుతాయి. ఈ సమస్యలు పోయేందుకు శరీరం హూనమయ్యే వ్యయామం ఏమి వద్ద్దని కేవలం పది నిమిషాలపాటు శరీరాన్ని వెనక్కి వంచుతూ చేసే బిట్స్ ని ఒక్కటి ఒక్క నిమిషం పాటు చేసిన చాలు అంటున్నారు. స్పోర్ట్స్ మెడికల్ జర్నల్ లో ఈ అవసరాన్ని వివరంగా చదువుకోవచ్చు.

Leave a comment