చాలా మందికి ఆహారం గబగబా తినేయటం అలవాటు. ఒక పరిశోధన ఎం చెబుతుందంటే ఒక నియమిత వేగంతో తిన్నప్పుడు మాత్రమే మన జీర్ణ వ్యవస్థలోని ఒక భాగం తనకి చాలు. కడుపునిండింది అన్న సంకేతాన్ని ఇవ్వగలుగుతుంది. వేగంగా తింటే ఈ వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అయిపోతూ సంకేతం ఇవ్వలేకపోతుంది. ఇక అలా ఎంత తిన్నా తృప్తి ఉండదు. అధిక బరువుకు కారణం ఇదే. పైగా అలా తినేవారు ఆహారాన్ని సరిగ్గా నమలరు. దీని వల్ల ఆహారంలో లాలాజలం కలవకపోవటం వల్ల తిన్నవి ఏవీ జీర్ణం కాకుండా పోతాయి. అందుకే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినమంటున్నారు వైద్యులు.

Leave a comment