షితా మిట్టల్ అండ్ మి పరిశ్రమ కో ఫౌండర్ ఈ పరిశ్రమ ద్వారా పి సి ఓ ఎస్ అదుపు చేసే పానీయం తో పాటు పీరియడ్స్ సమయంలో నొప్పి నివారించే చాకోలెట్స్ టీ తయారు చేస్తోంది. మహిళలను వేధించే యూరిన్ ట్రాక్ ఇబ్బందుల కోసం మూలికా పానీయం, జుట్టు రాలటం, చర్మం పేలవంగా మారటం వంటి సమస్యలకు పోషకాలతో కూడిన ప్రత్యామ్నాయాలను రూపొందించింది. ఐ.ఐ.టీ నుంచి బాంబే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసిన షితా మిట్టల్ యుఎస్ లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో ఎంబీఏ చేశారు. అండ్ మి మహిళా ఆరోగ్య ఉత్పత్తులు , బెంగళూరు నుంచి మన దేశంలో ప్రముఖ నగరాలకు విదేశాలకు కూడా విస్తరించాయి.