Categories
WoW

ప్రాణం పోసుకున్న టికులీ ఆర్ట్.

టికిలీ అంటే బొట్టు బీహారీ మహిళలు తమ నుదుటి పైన పెట్టుకునే  బొట్టు పేరు కానీ టికులీ  అంటే ఓ ప్రాచీనమైన కళ. దళసరి చక్క పైన, వస్త్రం పైన ప్రత్యేక శైలితో గీసే బొమ్మలివి. ఈ చేతి పనితనం గుర్తించి ఈ చిత్రాల్ని కొనేందుకు మొఘల్ చక్రవర్తి పాట్నా దాకా వచ్చి వాడుట ఈ చిత్రాలలో ముఖ్యంగా భారతీయ వివాహ ఘట్టాలు రామ్ లీలా వంటి చిత్రాలలో ముఖ్యంగా భారతీయ వివాహ ఘట్టాలు రామ్ లీలా వంటి చిత్రాలు ప్రేత్యేకం. ఈ కళ ఎప్పుడో కనుమరుగైన టీకులీ అనే పేరు మాత్రం ఎలాగోలా జనాల నోట మిగిలి పొయింది. అమ్మాయిల బొట్టులో తన ఉనికి నిల్పుకుందీ కళ. తన పరిశోధనలో ఈ కళ గురించి విని దానికి ప్రాణం పోసింది శివానీ బిస్సాస్. ఇందులో మహిళల్ని భాగస్వాముల్ని చేసింది. స్థానిక మహిళలు 300 మంది ఈ కళలో తోడ్పాటు ఇప్పించింది శివాని. అలా కనుమరుగైన కళ మహిళల చేతిలో జీవనం పోసుకుంది. ఇప్పుడీ చిత్రాలు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి.

Leave a comment