ఈ మధ్య కాలంలో మహిళలకు విరివిగా ఆపరేషన్లు చేసేస్తున్నారు. సీజేరియన్ ఆ తర్వాత హిస్ట్రేక్టమి జరిగిపోతున్నాయి. చిన్నపాటి సమస్యలకే గర్భసంచి, అండాశయాలు తొలగిస్తున్నారు. గర్భసంచి ఆపరేషన్‌ తో అనారోగ్యసమస్యలు కొని తెచ్చుకోవడమే. దీని తర్వాత చాలా మందిలో రక్తపోటు పెరగడం హర్మోన్ల మార్పులు గమనించారు. ప్రతి ముగ్గురిలో ఒకరు బరువు పెరుగుతున్నారు. గుండె సంబంధ వ్యాదుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా 35 నుంచి 45 ఏళ్ళ వయసులో చేసే ఈ ఆపరేషన్లు దీర్ఘకాలంలో కొత్త బాధలు తెస్తున్నాయి. మహిళల్లో ఫై బ్రాయిడ్స్ ఎండో మెట్రిసిన్ వంటి వాటికి ఆపరేషన్ కన్నా ప్రత్యామ్నాయం చూడమంటున్నారు.

Leave a comment