రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ట్రీ హౌస్ ఎంతో ఫేమస్ కె. పి సింగ్ అనే ఇంజనీర్ చెట్ల పైన ఉండే మమకారంతో 40 అడుగుల ఎత్తున 80 ఏళ్లనాటి పెద్ద మామిడి చెట్టు ను ఆధారంగా చేసుకుని మూడు అంతస్తుల ఇల్లు కట్టుకున్నారు ఇందులో కిచెన్, హాల్, బెడ్ రూమ్ అన్ని సౌకర్యాలు ఉంటాయి. నేల నుంచి తొమ్మిది అడుగుల ఎత్తులో చెట్టు చుట్టూ పిల్లర్లు వేసి దీన్ని కట్టారు సిమెంట్, ఇటుక బదులు స్టీలు, ఫైబర్ సెల్యులోజ్ షీట్స్ వాడారు చెట్టు పెరిగేందుకు వీలుగా మూడు అంతస్తులు మూసి తెరిచే లా ఉండే పైకప్పు కొమ్మలకు అడ్డు తగలకుండా గోడలకు రంధ్రాలు చేశారు. ఇంట్లోకి వెళ్లేందుకు రిమోట్ తో ఆపరేట్ చేసే మెట్లు లోపలి గదుల్లో అరల్లాగా మారిన చెట్టు కొమ్మల తో ఇల్లే చాలా విచిత్రంగా అందంగా ఉంటుంది !

Leave a comment