Categories
ఈ రోజు వాలెంటైన్స్ డే అనేకాదు అసలు ప్రేమకే ఈ ప్రపంచంలో చాలా గొప్ప ప్లేస్ వుంది . ఎప్పుడో శతాబ్దాల క్రితం ప్రేమ చిహ్నంగా వచ్చిన హృదయాకారపు లోగో ఇప్పటికీ చెక్కు చెదరకుండా వుంది. ఇచ్చి పుచ్చుకునే కానుకలు యాక్సెసరీస్ దగ్గరనుంచి వంటింట్లో వాడుకునే వస్తువుల దగ్గర నుంచి ఆఖరికి తాగే కప్పుల దాకా హృదయాకారం వామనుడి విశ్వరూపం లాగ ఆక్రమించింది. ఈ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ కిచెన్ వేర్ ఓసారి చూడండి. ప్రేమ వంటింట్లో కూడా పొంగి ప్రవహిస్తుంది.