Categories
వేల మీటర్ల ఎత్తున చాలీచాలని ప్రాణవాయువు, తాగేందుకు నీరు జనం కనిపించకపోవటం ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి అనిపించింది జీవితంలో ఎదురయ్యే సవాళ్లు కూడా ప్రయాణపు అనుభవాల వంటివే అని అర్థం చేసుకున్నాను అంటుంది నీలిమ పూదోట 8848 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ ఎక్కినప్పుడు అంతకు ముందు మనసులో ఉండే ఎన్నో భయాలు పోయాయి. ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా మనో నిబ్బరం తో బతకవచ్చని అర్థమయింది. ఇలాంటి సాహసాలు మహిళలకు కొండంత శక్తి ఇస్తాయి అంటోంది నీలిమ పూదోట. పర్వతారోహణ, నా శక్తి నిరూపించుకునే అవకాశం కోసంగా అనిపించింది .మొదటిసారి 6150 ఎత్తున్న పర్వతం ఎక్కాను దేన్నయినా జయించగలను అనిపించింది అంటుంది నీలిమ పూదోట.