Categories
వెండి తీగ లాంటి వర్షపు జల్లులు, చిరుగాలులతో వర్షాకాలం చల్లని గమ్మత్తు చేస్తుంది. అయితే వేసుకునే దుస్తులు, స్టయిల్స్ విషయంలో పూర్తిగా మార్పులు చేసుకుని తీరాలి .హఠాత్తుగా వానోస్తే తడిసిపోతాం కనుక తేలికగా ఆరిపోయే వీలున్న షిఫాన్ ,పాలిస్టర్ కాటన్ దుస్తులు ఎంచుకోవాలి. వర్షాల వేళలో వెలుగు తక్కువగా ఉండి పెద్ద హుషారు అనిపించదు .కనుక ఆకర్షణీయంగా ఉండే ముదురు రంగు దుస్తులు ఎంచుకోవాలి .ఆరెంజ్, ఎల్లో,నియాన్ గ్రీన్, పింక్, మొదలైన రంగులు బావుంటాయి. అలాగే ఫార్మల్ దుస్తులతో ఆఫీస్ లకు వెళ్లేవాళ్లు తడిసేందుకు వీలులేని వాటర్ ప్రూఫ్ సాక్స్ వేసుకోవాలి. ఇలాంటి సాక్స్ తో వర్షం లో తడిసిన పాదాలు నాని పోయి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి .స్టైల్ గా ఉండే మోడళ్లు ఎంచుకొని, జేరేందుకు వీలులేని ఫ్లిప్ ఫ్లాప్స్ ప్లాస్టిక్ ఫుట్ వేర్,జెల్లీ షూస్, క్రాక్స్ వంటివి వేసుకోవాలి .ఈ కాలానికి కాటన్ జీన్స్ బావుంటాయి.స్కర్ట్ లు క్రాఫ్టెడ్ జీన్స్ ఫ్యాషన్ గా అనిపిస్తాయి.ముదురు రంగు జీన్స్ వర్షం పడిన మరకలు కనిపించవు. అలాగే బురద చిందులు పడిన ఆరాక చక్కగా దులిపేసి ఉతికేసినా ఆనవాళ్లు లేకుండాపోతాయి. ముఖ్యంగా వాటర్ ప్రూఫ్ బ్యాక్ ప్యాక్ తప్పనిసరి. మొబైల్ ఫోన్,వాచ్,వాలెట్ తడవకుండా ఉండాలంటే వాటర్ ప్రూఫ్ బ్యాక్ ప్యాక్,అందులో ఒక చిన్న గొడుగు కూడా ఉంచుకోవాలి. టిష్యు పేపర్లు దువ్వెన వంటివి కూడా దగ్గరే ఉంచుకోవాలి. అన్నీ శ్రద్దగా ప్లాన్ చేస్తే వానల్లో ఇంచక్కా ఎంజాయ్ చేయచ్చు.