Categories
ఇయర్ బడ్స్ ఇంట్లో ఉంటే వాటిని కొన్ని విధాలుగా వాడుకోవచ్చు. అవసరం కూడ మేకప్ వేసుకునే క్రమంలో ముక్కు కనుబొమ్మల మధ్యలో కోన్ని సార్లు పౌండేషన్ పౌడర్ సరిగ్గా అంటుకోదు.ఇయర్ బడ్ కి పౌండేషన్ పౌడర్ చక్కగా అంటుకునేలా చేయవచ్చు.కళ్ళ కింద కన్సీలర్ వాడతారు. అలాంటప్పుడు చేత్తో రాస్తే సరిగ్గా అంటకపోవచ్చు. ఇయర్ బడ్ లో కన్సీలర్ తీసుకుని చక్కగా అద్దవచ్చు. గోళ్ళ రంగు వేసుకునేటప్పుడు కొన్నిసార్లు చర్మం మీదకి రంగు అంటుతుంది. అప్పుడు దాన్ని ఇయర్ బడ్ తో తుడిచేయవచ్చు.పెదవులకు లిప్ స్టిక్ వేసుకునే ముందర అవుట్ లైన్ గీస్తారు. లిప్ స్టిక్ ఆ గీత దాటి బయటకి వస్తే స్పాంజితోనే చేత్తోనో కాకుండా ఇఅయర్ బడ్ తో చక్కగా సరిచేయవచ్చు.