Categories
శక్తినిచ్చే ఆహారం అంటే కొన్ని కాంబినేషన్ లు తినడం మాత్రమే. వరి అన్నం తినే అలవాటుంటే అందులో కోర్రలు,పప్పు మోతాదు పెంచి అన్నం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. పచ్చని ఆకు కూరలు,కూరగాయలతో నూనే తక్కువగా వేసి వండిన కూరలు ఆరోగ్యం .ముల్లంగి శక్తినిచ్చే కూరగాయల్లో ఒకటి. ఇందులో పోటాషియం, మాంగనిస్, విటమిన్-బి వంటి పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల ముల్లంగి నుండి అందే కేలరీలు మాత్రం బరువు పెరగనివ్వని ఆహారంలో ఒకటి. రోజు సలాడ్ రూపంలో ముల్లంగిని తిసికోవచ్చు. క్యారట్ ద్వారా అందే పీచు త్వరగా జీర్ణం కాదు. విటమిన్ బి6,విటమిన్-కే, ఖనిజలవణాలు,యాంటి ఆక్సిడేంట్ లు,పోటాషియం పాస్ఫరస్ పోషకాలు ఎక్కువే.ఇవి మోదడును చురుగ్గా ఉంచేందుకు ఉపయోగపడతాయి.