Categories
1907-1954 మధ్య జీవించిన చిత్రకారిణి ఫ్రిడా కాయ్లో. ఆమె పేరుతో ఫ్రిడా అనే సినిమా వచ్చింది. 1925 లో 18 ఏళ్ళ ఫ్రిడా ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. శరీరం మొత్తం గాయాలే. గాయాల నుంచి కోలుకున్న జీవితాంతం విపరీతమైన నొప్పులతో బాధ పడింది ఫ్రిడా. ప్రమాదం తరువాత ఆమెకు 35 ఆపరేషన్లు చేశారు. తక్కువ కాలమే జీవించిన ఫ్రిడా గొప్ప చిత్రకారిణిగా పేరు తెచ్చుకుంది. ప్రపంచ ప్రఖ్యాత సెల్ఫ్ పోర్ట్రెయిట్ పెయింటర్ ఆమె నేనెప్పుడూ ఊహల్ని కలలను చిత్రించాను. సహజ చిత్రాలే నావి అంటుంది ఫ్రిడా కాయ్లో.