Categories
గర్భిణిగా ఉన్న సమయంలో తేలికైన వ్యాయామాలు చేయడం వల్ల పిల్లల్లో మధుమేహం ఇతర జీవక్రియ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెబుతారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు. ఇప్పుడు మనం పిల్లల్లో చూస్తున్న వ్యాధులు చాలా మటుకు పిండస్థ దశ నుంచి పుట్టుకొచ్చేవే.తల్లిదండ్రుల ఆరోగ్యం సరిగ్గా లేకపోతే పిల్లలపై అది ప్రతికూల ప్రభావం చూపెడుతుంది అంటున్నారు పరిశోధకులు. మహిళలను గర్భం దాల్చాక వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. గర్భము కష్టతరమైన వ్యాయామం కాకుండా తేలికైన వ్యాయామాలు చేయాలని అప్పుడే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.